
హైదరాబాద్, 08 జూన్ (హి.స.)
రాష్ట్రంలో ప్రజాపాలన కాదని నిజమైన హిట్లర్ పాలన ( Hitlers rule ) కు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ( Manne Krishank ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడ్డారు.హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా పెట్టానని, గాజా-ఇరాన్ తరహాలో పేదల ఇండ్లు కూల్చామని స్వయంగా ఒప్పుకున్న వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే తమపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులకు పాల్పడుతున్నారని ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. ఇది నిజమైన హిట్లర్ పాలనకు నిదర్శనమని ఆరోపించారు.హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ ప్రజలు ఇప్పటికీ క్షమాపణ చెబుతూనే ఉన్నారని, అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి స్ఫూర్తి అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi