
హైదరాబాద్, 08 జూన్ (హి.స.)
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.ఆ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 26,321 ఆర్థిక నేరాల కేసులు నమోదవగా.. 2023లో వాటి సంఖ్య స్వల్పంగా పెరిగి 26,881కు చేరింది. కానీ, 2024లో రోజుకు సగటున 108 చొప్పున ఏకంగా 39,127 కేసులు నమోదయ్యాయి. ఇది జాతీయ సగటు 15.3% కంటే చాలా రెట్లు ఎకువ. వీటిలో సరైన ఆధారాలు లేని కేసులు 19,207 ఉన్నాయి. మొత్తం కేసుల్లో పోలీసులు చార్జిషీట్లు వేసినవి 39.8 శాతమే. 39,127 కేసుల్లో పోలీసులు 9,542 మందిని మాత్రమే అరెస్టు చేశారు. వారిలో 8,608 మంది పురుషులు, 934 మంది మహిళలు ఉన్నారు. అరెస్టు అయినవారిలో 2,134 మంది పురుషులకు, 112 మంది మహిళలకు శిక్షలు పడ్డాయి. 2023 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మొత్తం 60,038 ఆర్థిక నేరాల కేసులు పెండింగ్లో ఉన్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi