ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ.
ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ.
హర్షవర్ధన్ రాజు


మార్కాపురం జిల్లా, 08 జూన్ (హి.స.)

ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ రోజు సోమవారం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో స్వయంగా అర్జీలు స్వీకరించారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

అర్జీదారుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande