విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం
విశాఖపట్నం 09 జూన్ (హి.స.) ,):విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh)ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం


విశాఖపట్నం 09 జూన్ (హి.స.)

,):విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh)ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఈరోజు (మంగళవారం) విశాఖపట్నంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. 4.15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని... 6 మంది గాయపడ్డారని చెప్పారు. తాము పరిహారం ఇవ్వడానికి ఇక్కడకు రాలేదని... శాశ్వతంగా బాధితులకు అండగా ఉంటామని లోకేశ్ భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్మికులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande