
విశాఖ 09 జూన్ (హి.స.)అక్కయ్యపాలెం, విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్లో సముద్ర విహారం చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చిందని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె.విజయమోహన్ తెలిపారు. డైమండ్ పార్కు సమీపంలోని సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ నెల 22 నుంచి జులై 15 వరకు కార్డినెల్లా క్రూయిజ్పై విహరించే అవకాశం కల్పిస్తున్నాం. 692 అడుగుల పొడవు, 11 అంతస్తులు, 796 కేబిన్లతో సుమారు 1,600 మంది ఒకేసారి ప్రయాణించే విలాసవంతమైన కార్డినెల్లా క్రూయిజ్ ఈ నెల 22న చెన్నైలో బయలుదేరి 24న విశాఖకు చేరుకుంటుంది. ఈ ఏడాది విశాఖ నుంచి చెన్నైకు నాలుగు, చెన్నై నుంచి విశాఖకు నాలుగు ట్రిప్స్లో సముద్ర విహారానికి అవకాశం కల్పించాం. రెండు రాత్రుళ్లు ఇద్దరు ప్రయాణించడానికి సుమారు రూ.48 వేలు, మూడు రాత్రుళ్లు ఇద్దరు ప్రయాణించడానికి సుమారు రూ.70 వేలు ఖర్చు అవుతుంది. ఈ ప్రయాణానికి అవసరమైన టికెట్లు అన్ని ట్రావెల్ ఏజెన్సీల్లో లభిస్తాయి’ అని విజయమోహన్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ