ఎసిబికి చిక్కిన అతి పెద్ద అవినీతి తిమింగలం
ఎసిబికి చిక్కిన అతి పెద్ద అవినీతి తిమింగలం
ACB


హైదరాబాద్, 09 జూన్ (హి.స.)

ఎసిబి వలకు మంగళవారం అతిపెద్ద అవినీతి తిమంగలం చిక్కింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జె. బాలు నాయక్ ఇంటికిపై ఎసిబి దాడి చేసింది..

మాదాపూర్ లోని ఆయన నివాసంతో పాటు మొత్తం పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మోహన్ నాయక్ పై ఎప్పటినుండో ఆరోపణలు రావడంతో ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు టెండర్లకు విరుద్ధంగా నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు సిబ్బందితో కలిసి అవినీతి పాల్పడేవాడని కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తన అనుచర వర్గాన్ని ఏర్పరచుకుని వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా అమాత్యులు ఆదేశాలిచ్చినా ఆర్ అండ్ బి శాఖలో మోహన్ నాయక్ ను ప్రసన్నం చేసుకోకుండా పని జరగదే కాదు అని డిపార్ట్మెంట్ లో ఒక బలమైన అభిప్రాయం ఉన్నట్టు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande