ఫుడ్ ఐటమ్స్ నిలువ, ప్యాకింగ్ కోసం న్యూస్ పేపర్స్ వాడొద్దు : FSSAI
హైదరాబాద్, 09 జూన్ (హి.స.) ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(food safety and security authority of India FSSAI) మరోసారి స్పష్టంచేసింది. వీధి వ్యాపారులు (Stre
Foid


హైదరాబాద్, 09 జూన్ (హి.స.)

ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(food safety and security authority of India FSSAI) మరోసారి స్పష్టంచేసింది. వీధి వ్యాపారులు (Street venders), రెస్టారెంట్లు(Restaurants), కిచెన్లు సహా అన్ని రకాల ఆహార విక్రయ సంస్థలు ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. వార్తాపత్రికల వాడకంవల్ల తీవ్రమైన ఆరోగ్య ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో సీసం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, ఇతర రసాయనాలు ఉంటాయని FSSAI వివరించింది.

వేడిగా ఉండే ఆహారపదార్థాలు, నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడ వంటి పదార్థాలను పేపర్లలో చుట్టినప్పుడు, ఆ రసాయనాలు సులభంగా ఆహార పదార్థాల్లోకి చేరుతాయి. ఇలాంటి కలుషిత ఆహారాన్ని తీసుకోవడంవల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు సంభవించడంతోపాటు మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని FSSAI హెచ్చరించింది. ఇటీవల ముంబైలోని ఓ ప్రముఖ వడపావ్ విక్రయదారుడు వార్తాపత్రికలను వినియోగిస్తున్నట్లు FSSAI, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) జరిపిన సంయుక్త తనిఖీల్లో వెల్లడైంది.ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande