పోడు రైతులను అడ్డుకున్న పోలీసులు..కుమ్రంభీం జిల్లాలో ఉద్రిక్తత :
పోడు రైతులను అడ్డుకున్న పోలీసులు..కుమ్రంభీం జిల్లాలో ఉద్రిక్తత :
Asifabad


కుమ్రంభీం ఆసిఫాబాద్ :, 09 జూన్ (హి.స.)

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోడు భూములు దున్నుతున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. అటవీ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో పోడు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు అడ్డుకోవడం సరైంది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande