సింగరేణి గనుల సాక్షిగా కాంగ్రెస్ అక్రమాలు.. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్
సింగరేణి గనుల సాక్షిగా కాంగ్రెస్ అక్రమాలు.. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్
Mlc


హైదరాబాద్, 09 జూన్ (హి.స.)

సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను, దోపిడీని బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ ను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. చంచల్ గూడ జైలులో బాల్క సుమన్ను ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత బిడ్డ సింగరేణి కాలరీస్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అక్కడున్న అవినీతికి వ్యతిరేకంగాఒక మాట ఏదో అంటే అదో పెద్ద నేరమైనట్టుగా బాల్క సుమన్ను తీసుకొచ్చి జైలులో బంధించారన్నారు. ఏ చట్టం ప్రకారమైతే సుమన్ నేరస్థుడని జైలులో పెట్టారో.. మరి అదే చట్టం రేవంత్ రెడ్డికి ఎందుకు వర్తించదన్నారు. లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటే రౌడీ భాష, తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని కార్యకర్తలకు పిలుపునిస్తే అది క్రిమినల్ భాష అని దాసోజ్శ్రవణ్ కుమార్ అన్నారు.

సింగరేణి కాలరీస్లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నయి. అక్కడున్న కార్మికులకు అనేక కష్టనష్టాలున్నాయని, సింగరేణి కార్మికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టు జైలులో పెట్టారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ఒకవేళ సుమన్ మాట్లాడింది తప్పే అయితే మరి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు.. ఆయన పేరు మీద ఎఫ్ఎఆర్ ఎందుకు నమోదు చేయరని దాసోజ్శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande