నిర్మల్ జిల్లాలో విషాదం..గోదావరిలో ముగ్గురు అన్నదమ్ముల గల్లంతు
నిర్మల్, 09 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో అన్నదమ్ములు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని కాచిగూడు చప్పల్ బజార్కు చెందిన సోదరులు చంద్రశేఖర్ (38), రాంచందర్(36), మల్లేష్ కమార్(
Nirmal


నిర్మల్, 09 జూన్ (హి.స.)

నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు

చేసుకుంది. గోదావరిలో అన్నదమ్ములు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని కాచిగూడు చప్పల్ బజార్కు చెందిన సోదరులు చంద్రశేఖర్ (38), రాంచందర్(36), మల్లేష్ కమార్(31) మండళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్లారు.

పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande