కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు. సీపీఐ, సీపీఎం నాయకుల ఆగ్రహం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు. సీపీఐ, సీపీఎం నాయకుల ఆగ్రహం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకపై సీపీఐ, సీపీఎం నాయకుల ఆగ్రహం!


అనంతపురం, 09 జూన్ (హి.స.)అనంతపురం నగరంలోని ప్రముఖ కూడలి టవర్ క్లాక్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఎం) సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీలు సమరశంఖం పూరించాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న పాలకుల తీరుపై సీపీఐ, సీపీఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం నగరంలోని ప్రముఖ కూడలి టవర్ క్లాక్ వద్ద వామపక్ష పార్టీలు సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆకాశాన్నంటేలా నినాదాలు చేశారు. వామపక్షాల ఆందోళనతో సుభాష్ రోడ్, టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ కూడలి పరిసర ప్రాంతాలన్నీ ఎర్రజెండాలతో రెపరెపలాడాయి.

ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నడ్డి విరుస్తున్న ధరలు నిత్యావసర వస్తువులు ఇంధన ధరలను వరుసగా పెంచుకుంటూ పోతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బూటకపు హామీలతో ప్రజలను వంచిస్తూ, అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.ధరల భారాన్ని తక్షణమే తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande