ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర’: 2000 మందితో అట్టహాసంగా యోగాసనాలు!
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర’: 2000 మందితో అట్టహాసంగా యోగాసనాలు!
cumbum-tank-yoga-event-collector-vijaya-sunitha-and-mla-ashok


మార్కాపురం, 09 జూన్ (హి.స.) ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

యోగాంధ్ర–2026లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రజా ఉద్యమంలా నిర్వహిస్తున్నామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ గురువులు యోగాసనాలు వేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల చేత యోగాసనాలు వేయించారు.

దాదాపు కంభం చెరువు కట్టపై 2000 మందికి పైగా ఏకకాలంలో యోగాసనాలు వేశారు. శారీరిక దృఢత్వం, మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కొరకు యోగా చేయడం ఉత్తమ మార్గమని యోగా గురువులు ప్రజలకు తెలిపారు. ఈనెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande