సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్
సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్
సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్


హైదరాబాద్, 09 జూన్ (హి.స.)సింగరేణి కాలరీస్లో జరుగుతున్న భారీ అక్రమాలు, అవినీతిని బయటపెట్టినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్న బాల్క సుమన్ను ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రవణ్... రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సింగరేణిలో జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన ఒక దళిత నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టారని శ్రవణ్ మండిపడ్డారు. సుమన్ మాట్లాడటం నేరమైతే, అదే సూత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిత్యం వాడుతున్న అసభ్యకర, రెచ్చగొట్టే భాషపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు. తెలంగాణలో రాజ్యాంగ పాలనకు బదులు ‘ఫాసిస్ట్ పాలన’ సాగుతోందని ఆయన విమర్శించారు.

సింగరేణి కాలరీస్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పాల్పడుతోందని శ్రవణ్ ఆరోపించారు. తక్షణమే బాల్క సుమన్పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande