కదిరిలో బీజేపీలోకి భారీగా చేరికలు: విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న 300 మంది నేతలు!
కదిరిలో బీజేపీలోకి భారీగా చేరికలు: విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న 300 మంది నేతలు!
విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న 300 మంది నేతలు!


కదిరి, 09 జూన్ (హి.స.)కదిరి పట్టణం, కదిరి రూరల్ మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు.

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన చేరిక కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లికి చెందిన వెంకట నారాయణరెడ్డి, కదిరి పట్టణానికి చెందిన వెంకటరెడ్డి, కుటాగుళ్లకు చెందిన మహిళా నేత నాగేశ్వరి, ప్రముఖ వైద్యులు జ్ఞానేశ్వర్తో పాటు మైనారిటీ వర్గానికి చెందిన పలువురు నాయకులు తమ అనుచరులతో కలిసి దాదాపు 300 మంది బీజేపీ కండువాలు ధరించి అధికారికంగా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, జాతీయవాద భావజాలం, పేదలు మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరడం పార్టీపై రోజురోజుకూ పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande