
కదిరి, 09 జూన్ (హి.స.) కదిరి పట్టణంలో విద్యను వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు పాఠశాలల యజమానులు స్కూళ్లను నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. ఇక తమ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ రూల్స్ను తప్పక పాటించాల్సిందే అన్నట్లుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సరికొత్త తరహాలో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులను గుల్ల చేస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివించి, ప్రయోజకులను చేయించాలని కలలు కంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల చదువు కోసం కష్టపడి సంపాదించినదంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, 25% ఉచిత సీట్ల నిబంధన అమలు చేయాలని సిపిఎం నాయకలు బుడగల హరీష్, పవన్ కుమార్ .ఆర్డీవో కళావతికి వినతిపత్రం సమర్పించి డిమాండ్ చేసారు.
ఈరోజు ప్రభుత్వ ఆర్డిఓ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ఆర్డీవో కళావతి మేడం కు మర్యాదపూర్వకంగా కలిసి కదిరి పట్టణంలోని పలు విద్యాసంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు, ప్రభుత్వ నిబంధనలను ఆచరణలో పెట్టకుండా పలు విద్యాసంస్థలు డబ్బు సంపాదించే ఆదాయ వనరులుగా మారుతున్నాయని, స్కూళ్లలో అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్నారని,అలాగే స్కూళ్లలోని యూనిఫామ్ లను, పుస్తకాలను పెన్నులను పెన్సిల్ ళ్లను సైతం కొనాలని హుకుమ్ జారీ చేస్తున్నారు, కనీసం పిల్లల ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి ఆటస్థలం లేని స్కూల్ లు కూడా ఉన్నాయి.
పేద ప్రజలు వారి జీవితాలను పణంగా పెట్టి పిల్లల కోసం బయట అప్పులు చేసి మరి స్కూల్ యాజమాన్యానికి డబ్బులు దోచిపెడుతున్నారు, వీటన్నింటిని కొంతమంది ప్రభుత్వాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి అటువంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ ఫీజు లను బహిరంగంగా ప్రతి స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిబంధనలను అనుసరించని విద్యాసంస్థలను గుర్తింపులను రద్దుచేసి పేద ప్రజలు అన్యాయంగా అప్పులు పాలు కాకుండా చూడాలని పిల్లల జీవితాలలో చదువు వారి భవిష్యత్తు బంగారు బాట వేసే విధంగా ఉండాలి అని విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని తెలియజేశాము
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV