మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు గారి 80వ జయంతి వేడుకలు
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు గారి 80వ జయంతి వేడుకలు
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు గారి 80వ జయంతి వేడుకలు


నగిరి, 09 జూన్ (హి.స.)

: మాజీ మంత్రి,ప్రజానాయకులు స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడు 80వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన వెంకట్రామాపురంలోని స్మృతి వనంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజాసేవకు ఆయన చేసిన సేవలు,రాజకీయ జీవితంలో నెలకొల్పిన విలువలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు.ఆయన ఆశయాలు,సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొని స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడుకి ఘనంగా నివాళులర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande