
విశాఖపట్నం, 09 జూన్ (హి.స.)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన దురదృష్టకర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ మేరకు స్పందించిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు స్థానిక అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవాళ సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ వేడి ఉక్కు ద్రవం ఉన్న ల్యాడిల్ విస్ఫోటనం చెందడంతో 9 మంది కార్మికులు మృతి చెందడం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi