
అనంతపురం, 09 జూన్ (హి.స.)
గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు యోగా ఉత్సవములలో భాగంగా మూడవ రోజు మంగళవారం గుంతకల్ కు చెందిన అంతర్జాతీయ యోగా శిక్షకులు జి.వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో దేవస్థానం ముందు ప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా శిక్షకులు జి.వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దిశానిర్దేశం, స్ఫూర్తితో జిల్లాలో ఊరూవాడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పార్కు తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోటా యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్య, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్యాశాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ యోగా శిక్షకులు జి.వంశీకృష్ణ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV