అధికలాభాలు వస్తాయంటూ ఖాతాదారులను మోసం...ఆల్మైటి బిజినెస్ సంస్థ డైరక్టర్ల అరెస్టు
అధికలాభాలు వస్తాయంటూ ఖాతాదారులను మోసం...ఆల్మైటి బిజినెస్ సంస్థ డైరక్టర్ల అరెస్టు
fraud


, 10 జూలై (హి.స.)

కాకినాడ

, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.15 వేల చొప్పున చెల్లిస్తామని మాయమాటలు చెప్పి సంస్థ భారీగా డిపాజిట్లు సేకరించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు రూ.48 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

కొన్ని నెలలుగా పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిపివేయడంతో కాకినాడలోని ఆల్మైటి జెనిసెస్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఆరుగురు ఖాతాదారులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన సంస్థ డైరెక్టర్లను కోర్టులో హాజరుపర్చనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande