కస్తూరిభా విద్యాలయం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కస్తూరిభా విద్యాలయం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Collector


ఖమ్మం, 14 జూలై (హి.స.)

మంగళవారం మధ్యాహ్నం కూసుమంచి మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ పాల్గొన్నారు. కూసుమంచి శివారులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని, మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాలల భవనాలను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను, కాంట్రక్టర్ లను ఆదేశించారు. అనంతరం కస్తూరిభా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాగా విద్యార్థులు తమకు నీటి సమస్య ఉందని కలెక్టర్ కు తెలిపారు. కాగా వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను అదేశించారు. అనంతరం కూసుమంచి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగే సర్ ప్రక్రియను పరిశీలించారు. త్వరితగతిన సర్ ప్రక్రియను పూర్తి చేయాలనీ అర్హులైన వారి ఒక్క ఓటు కూడా తొలగకుండా చూడాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande