గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. కల్వకుర్తి ఎమ్మెల్యే
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. కల్వకుర్తి ఎమ్మెల్యే
Mla


నాగర్ కర్నూల్, 10 జూలై (హి.స.)

గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ

లక్ష్యమని, ప్రతి గ్రామానికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కర్కల్ పహాడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande