ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే
MLA


నారాయణఖేడ్, 10 జూలై (హి.స.)

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ ఆల్ నిర్వహించిన గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ( జీపీడీపీ) సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. గ్రామాల్లో ఎదురవుతున్న ప్రాథమిక సమస్యలను గుర్తించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాత్ర అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నివారణ వంటి మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిదెందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిధుల వినియోగంలో పార దర్శకత్వం పాటించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నా వంతు పూర్తి సహకారం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande