
హైదరాబాద్, 10 జూలై (హి.స.)విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజాభవన్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల బంద్లో భాగంగా ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవటం లేదని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆయన ఆడుకుంటున్నారని ధర్నాకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల సహా... ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడికి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్