
మదనపల్లె, 10 జూలై (హి.స.) : యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ భారతి క్రికెట్ అకాడమీని శుక్రవారం కురవంకలో ఘనంగా ప్రారంభించారు. విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి అకాడమీని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించేందుకు విజయ భారతి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV