
అనంతపురం క్రైం,, 11 జూలై (హి.స.)
ముసుగు వేసుకుని పెద్ద పెద్ద మాల్స్లో చోరీలు చేస్తున్న నాగరాజుగారి ఆనంద్(41) అనే వ్యక్తి అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని చోర కథలు విని అవాక్కయ్యారు. ‘పేదల ఇళ్లవైపు చూడను సర్. పాపం వస్తుంది. కేవలం డబ్బున్నవారినే టార్గెట్ చేస్తాను. పెద్ద పెద్ద మాల్స్లో మాత్రమే చోరీలు చేస్తాను..’ అని చెబుతూ.. దొంగల్లోనూ నాలా మంచి దొంగలు ఉంటారు సర్ అన్నట్లు ఫేస్ పెట్టాడట. రవితేజ నటించిన కిక్ సినిమా తరహాలో చోరీలు చేసినా, హీరో తరహాలో ఎవరికీ పంచిపెట్టలేదు.. తన సొంతానికి వాడుకున్నాడు. అనంతపురం నగరంలోని డ్రెస్ సర్కిల్, శ్రీకాంచీపురం పీఎ్సఆర్ షాపింగ్ మాల్స్లో ఇటీవల చోరీలు జరిగాయి. ముఖం కనిపించకుండా ముసుగు, మాస్క్ ధరించిన వ్యక్తి చోరీలు చేసినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. ఈ కేసులను దర్యాప్తు చేసిన అనంతపురం వన్టౌన్, సీసీఎస్ పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసి, మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ మహబూబ్ బాషా ఈ కేసుల వివరాలను మీడియాకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ