
అమరావతి, 11 జూలై (హి.స.)
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే లా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు సీఎం సూచించారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ప్రత్యేకంగా తాగునీరు, పశుగ్రాసాల నిల్వల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో పోరంబోకు భూమిని పట్టా భూమిగా మార్చిన తరహాలో ప్రభుత్వం పరిష్కరించగలిగిన భూ సమస్యలను 2027 మార్చిలోగా పరిష్కరించాలని రెవిన్యూశాఖను సీఎం ఆదేశించారని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సిఫారసుల మేరకు రూ.11,569.91 కోట్ల పెట్టుబడులతో 31,431 ఉపాధి అవకాశాలు కల్పించే 13 ప్రతిపాదనలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ