బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు బ్రాంచిలో పదికోట్ల బంగారం మాయం
బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు బ్రాంచిలో పదికోట్ల బంగారం మాయం
BOI


ఏలూరు , 11 జూలై (హి.స.)

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు బ్రాంచిలో ఇటీవల రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయమైన కేసును పోలీసులు ఛేదించారు. ఏలూరులో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ వివరాలు వెల్లడించారు. ‘బ్యాంకులో మొత్తం 176 బంగారు రుణాల ఖాతాలకు సంబంధించిన ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులోని గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు దఫదఫాలుగా నగలను కాజేసి, వాటి స్థానంలో నకిలీవి ఉంచాడు. కాజేసిన నగలను వర్తకులకు విక్రయించాడు. నిందితుడి నుంచి రూ.5,81,65,000 విలువైన 4.120 కిలోల నగలను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడికి ఐదుగురు బ్యాంకు ఉద్యోగులు సహకరించినట్లుగా తెలిసింది’ అని ఎస్పీ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande