విశాఖ కు చెందిన టికీ రాధ గాయత్రి అనుమాస్పద మృతి కేసులో కీలక పరిణామం
విశాఖ కు చెందిన టికీ రాధ గాయత్రి అనుమాస్పద మృతి కేసులో కీలక పరిణామం
విశాఖ కు చెందిన టికీ రాధ గాయత్రి అనుమాస్పద మృతి కేసులో కీలక పరిణామం


విశాఖపట్నం, 11 జూలై (హి.స.)

: విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ను దేహ్రాదూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

విజయనగరం జిల్లాకు చెందిన రాధాగాయత్రి ) అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్ హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే దేహ్రాదూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మసూరీ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14-16 మధ్య మసూరీలో ఏం జరిగిందో అధికారుల దర్యాప్తులో తేలనుంది. తల్లిదండ్రులు రాకుండానే శవపరీక్ష చేసిన సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande