
అమరావతి, 11 జూలై (హి.స.)
ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన 'మోస్ట్ పవర్ఫుల్ విమెన్' జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు దక్కడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. బ్రాహ్మణి ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించడం ఎంతో అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ఇది ఆమె నాయకత్వం, దూరదృష్టి, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపని కొనియాడారు.
బ్రాహ్మణి సాధించిన ఈ ఘనత యువతులకు, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్లో కూడా బ్రాహ్మణి మరిన్ని విజయాలు సాధిస్తూ, కొత్త మైలురాళ్లను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తన సందేశంలో తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ