
హైదరాబాద్, 11 జూలై (హి.స.)హైదరాబాద్ నగరంలోని లాస్ట్బస్టాప్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చక్రధర్కాలనీ, ధరణినగర్, ఆల్విన్కాలనీ ఫేజ్-2, ఆల్విన్కాలనీ లాస్ట్బస్టాప్, వెంకటయ్యనగర్, తులసినగర్, తులసీవనం అపార్ట్మెంట్స్లో విద్యుత్ ఉండదన్నారు.
ఉప్పల్: ఉప్పల్ కల్యాణ్పురి ఫీడర్ ఫరిధిలోని ఎన్జీఆర్ఐ 33/11 కేవీ సబ్ స్టేషన్లో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఉప్పల్లోని జాహీద్ నగర్, బ్యాంక్ కాలనీ, ఇందిరానగర్, అంబేడ్కర్ నగర్, సీతారాం కాలనీ, తూర్పు, ఉత్తర కల్యాణ్పూరి, బాలాజీ ఎన్క్లేవ్, రాఘవేంద్ర కాలనీ, టీచర్స్ కాలనీ, అజ్మత్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
జికేనగర్, గుడ్లక్ హోటల్ ఫీడర్లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యు త్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. గోకు ల్నగర్, పార్వతీనగర్, హెచ్ఐజి-ఏ, ఆఫీసర్స్ కాలనీ, జి-బ్లాక్, శారదా ఆస్పత్రి, వాటర్వర్క్స్ కార్యాలయం, అంకురా ఆస్పత్రి పరిసర ప్రాంతాలలో ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు, రాధికా చౌరస్తా నుంచి గుడ్లక్ హోటల్ ప్రధాన రహదారి, ఎల్ఐజి-ఏ పార్ట్ ప్రాంతాలలో మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో కోత ఉంటుందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆమె కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్