తెలంగాణ జనసేనలో కొత్త జోష్.. పవన్ సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు
తెలంగాణ జనసేనలో కొత్త జోష్.. పవన్ సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు
janasena


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా జనసేన పార్టీ కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో రాజకీయ, విద్య, కార్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జనసేనలో చేరిన వారిలో తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి. రవీందర్ ముఖ్యులు. వీరితో పాటు ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత, నిజామాబాద్‌కు చెందిన మీసాల శ్రీనివాస్ రావు, ట్రేడ్ యూనియన్ నేత దేవరకొండ రామ్మోహన్ రావు, హైకోర్టు న్యాయవాది మైదంశెట్టి రవివర్మ, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బి. రవీందర్ గౌడ్ తదితరులు పార్టీలో చేరారు.

వీరితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆరే మహేందర్, వైద్య రంగ నిపుణులు డాక్టర్ బండారు రాజ్‌కుమార్, డాక్టర్ ఎడ్ల సాయి కృష్ణప్రియ కూడా జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande