
సత్యవేడు, 11 జూలై (హి.స.) సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం తడ–శ్రీకాళహస్తి ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ప్రజలు దీర్ఘకాలం సురక్షితంగా ప్రయాణించేలా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన రోడ్డు నిర్మించాలని సూచించారు. భవిష్యత్తులో ఈ రహదారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాణ్యమైన రోడ్లలో ఒకటిగా నిలిచేలా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV