వియత్నాంలో బోటు ప్రమాదం - పలువురు తెలంగాణ పర్యాటకులు మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం - పలువురు తెలంగాణ పర్యాటకులు మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం - పలువురు తెలంగాణ పర్యాటకులు మృతి

హైదరాబాద్, 11 జూలై (హి.స.)

వియత్నాంలో పర్యాటకుల బోటు మునిగి పలువురు భారతీయ పర్యాటకులు గల్లంతయ్యారు. వియత్నాంలోని ఫు క్యూక్‌ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ తరఫున వెళ్లిన ఇటీవల ఓ బృందం భారత్‌ నుంచి వియత్నాం పర్యటనకు వెళ్లింది. సదరు కంపెనీ 250 మంది డిస్ట్రిబ్యూటర్లను తీసుకెళ్లింది. ఇందులో 40 మంది తెలంగాణ, 35 మంది ఏపీకి చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈమేరకు వియత్నాంలోని భారత ఎంబసీ ఎక్స్​లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande