విశాఖపట్నం ఈ రోజు తెల్లవారు జామున భూప్రకంపనలు
విశాఖపట్నం ఈ రోజు తెల్లవారు జామున భూప్రకంపనలు
Earthquake


విశాఖపట్నం, 12 జూలై (హి.స.)

:విశాఖపట్నంలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల భూమి కంపించింది. సాగర్నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో జనం భయపడిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande