
అమరావతి, 12 జూలై (హి.స.)
‘జై గోదావరి తల్లి’ అంటూ ఓ విదేశీయుడు సైకిల్యాత్ర చేపట్టాడు. యూరప్లోని చెక్రిపబ్లిక్కు చెందిన యావర్.. భారతదేశ అన్వేషణలో భాగంగా పర్యటిస్తున్నారు. పవిత్ర గోదావరి నది విశిష్టతను తెలుసుకుంటూ ఒంటరిగా సైకిల్పై ప్రయాణిస్తున్నాడు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. పల్లె ప్రజల జీవనశైలిని తెలుసుకుంటూ సాగుతున్న యావర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం-మహదేవపూర్-గోదావరి మీదుగా ప్రయాణించారు. తన సైకిల్కు ప్రత్యేకంగా ‘జై గోదావరి తల్లి’ అని తెలుగులో బోర్డును తగిలించుకున్నారు. గోదావరి నది ప్రారంభమయ్యే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద 2026 జూన్ 17న తన యాత్రను ప్రారంభించానని, నదీ తీర ప్రాంతాల మీదుగా ప్రయాణించి గోదావరి సముద్రంలో కలిసే ఏపీలోని అంతర్వేదికి చేరుకుంటానని యావర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ