బీభత్సం సృష్టించిన మహిళా.వైద్యులు ప్రయాణిస్తున్న కారు.
బీభత్సం సృష్టించిన మహిళా.వైద్యులు ప్రయాణిస్తున్న కారు.
బీభత్సం సృష్టించిన మహిళా.వైద్యులు ప్రయాణిస్తున్న కారు.


ఒంగోలు, 12 జూలై (హి.స.)

: ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళా వైద్యులు ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో సైకిల్పై వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసు(36)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రోడ్డుకి అవతల వైపు ఉన్న సర్వీస్ రోడ్డులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత కారు ముందుకు దూసుకెళ్లి చెత్త ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్నది మహిళా వైద్యులుగా గుర్తించారు. ఒంగోలులో జరుగుతున్న గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సుకు హాజరైన వీరు ఆదివారం ఉదయం కాఫీ షాప్కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలియగానే జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. తాలూకా సీఐ టి.విజయ్ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande