సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర : జానకి మృతి పట్ల గవర్నర్, సీఎం సంతాపం
సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర : జానకి మృతి పట్ల గవర్నర్, సీఎం సంతాపం
S.Janaki


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

ప్రముఖ గాయని ఎస్‌. జానకి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జానకి మృతి పట్ల గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గాన కోకిలగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. వారి మరణం ముఖ్యంగా దక్షిణ భారత సంగీతానికి, పాటకు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గవర్నర్​ శివ ప్రతాప్‌ శుక్లా విచారం : ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యస్​.జానకిని లక్షలాది హృదయాలను తాకిన స్వర్ణకంఠంగా, మాధుర్యం, భక్తి, కళాత్మక నైపుణ్యానికి శాశ్వత ప్రతీకగా అభివర్ణించారు. తెలుగుమండి పుత్రిక అయిన ఆమె, తన అసాధారణ ప్రతిభతో, కాలాతీతమైన స్వరంతో ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసి, సాటిలేని సంగీత వారసత్వాన్ని మిగిల్చారని ఆయన అన్నారు. ఆమె హృద్యయమైన గానం తరతరాల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె మరణం తీరని లోటని గవర్నర్ శుక్లా సంతాపాన్ని ప్రకటించారు.

సీఎం రేవంత్​ రెడ్డి ప్రగాఢ సానుభూతి : దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవ రసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయన్నారు. జానకి తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం, అలాంటి జానకమ్మ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande