
అమరావతి, 12 జూలై (హి.స.)
విజయనగరం రూరల్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కనపాక ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. బీఎల్వోలకు ప్రజలందరూ పూర్తి సమాచారం ఇచ్చి, సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సర్ ప్రక్రియపై బీఎల్వోలతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ