రైతన్నల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధమే..: కేటీఆర్
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR


హైదరాబాద్, 12 జూలై (హి.స.)సీఎం రేవంత్రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల కోసం నీళ్లు అడిగితే తమపై ఆరోపణలు చేస్తారా అని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన పిల్లలను ఎన్కౌంటర్లు చేశారని దుయ్యబట్టారు.

1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపింది కాంగ్రెస్ సర్కార్ కాదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. 1969లో 369 మందిపై తూటాల వర్షం కురిపించారని మండిపడ్డారు. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారని ఆరోపించారు. అన్నదాతలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. రైతన్నల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేశారని తెలిపారు. తెలంగాణలో ఎండుతున్న పొలాలకు వెంటనే నీరు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande