
మెదక్, 12 జూలై (హి.స.)
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర
సవరణ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆందోల్ నియోజక వర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సిరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలని సూచించారు.ప్రతి ఒక్క ఓటర్లకు మండల ప్రజాప్రతినిధులు సూచనాలు ఇవ్వాలని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ఉండకుండా BLA లు బూతుల వారీగా రోజు వారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఓటర్లతో సమన్వయం చేసుకొని ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.పూర్తి అయినా ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేందుకు బూత్ లేవల్ అధికారుల బిఎల్వోలకు అందజేయాలని మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..