
ఖమ్మం, 12 జూలై (హి.స.)
వైరా రిజర్వాయర్ కింద 30 వేల
ఎకరాలు సాగునీరు కోసం గోదారమ్మను కృష్ణమును గెలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైరా ఎమ్మెల్యేగా తనకే దక్కుతుందని, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తిమ్మరావుపేట సమీపంలో నాగార్జునసాగర్ కాలవ పై వైరా రిజర్వాయర్ వెళ్లే ఎస్కేపులను ఎత్తి రిజర్వాయర్కు నీళ్లు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ కు వదిలి ఆయుకట్టు కింద ఉన్న సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ధ్యేయంగా పనిచేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ధనం వృథా జరిగిందని, ఒక్క ప్రాజెక్టు కూడా రూపకల్పన చేసిన దాఖలు లేవు అన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో ప్రజల సంక్షేమ మరిచి దోచుకోవటమే ధ్యేయంగా కేసీఆర్ కుటుంబం పనిచేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా, సాగు నీరు, త్రాగునీరు, విద్య, వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. వైరా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కోసం ఎంతవరకైనా పోరాడుతున్న అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..