
నిజాంపట్నం, 12 జూలై (హి.స.)
: ప్రఖ్యాత గాయని ఎస్.జానకి మృతి సినీ రంగానికి తీరని లోటు అని తెదేపా సీనియర్ నాయకుడు, కూచినపూడి మార్కెట్ యార్డు ఛైర్మన్ ఓగిబోయిన వెంకట్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జానకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమణారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ