రేపు మణుగూరులో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేపు మణుగూరులో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి


మణుగూరు, 12 జూలై (హి.స.)

కేంద్ర బొగ్గు గనుల శాఖ

మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులో జరిగే గేట్ మీటింగ్లో పాల్గొననున్నారు. 1985లో మణుగూరు జూనియర్ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికల సమయంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మణుగూరుకు వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి మణుగూరుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించి మణుగూరు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande