మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం... చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు
మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం... చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు
మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం... చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) నూతన కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితమైన, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఇటీవల ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రవాసాంధ్రులందరూ ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా, నూతన బాధ్యతలు చేపట్టినందుకు గుర్తుగా కో-ఆర్డినేటర్లు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం, పదవులు పొందిన ప్రతినిధులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. తమపై నమ్మకం ఉంచి, ప్రవాసాంధ్రులకు సేవ చేసేందుకు కో-ఆర్డినేటర్లుగా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల తరఫున ఏ విధంగా పూర్తిస్థాయిలో సహకారం అందించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రగతిలో ప్రవాసాంధ్రులు కేవలం పెట్టుబడిదారులకే పరిమితం కాకుండా, క్రియాశీలక భాగస్వాములు కావాలని తీర్మానించుకున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరవేయాలని నిర్ణయించారు. నూతన కో-ఆర్డినేటర్లుగా తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి శాయశక్తులా కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande