ముంబై వెళ్లి పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ముంబై వెళ్లి పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
babu


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ముంబై వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్, ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

పవన్ కల్యాణ్ చాలాకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగుల సమయంలో అయిన పాత గాయాలు ఇప్పుడు తీవ్రం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి ఎన్నికల ప్రచార సమయంలో కూడా తీవ్రమైన నొప్పిని భరిస్తూనే ఆయన కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు.

ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్యుల బృందం పవన్ కల్యాణ్‌కు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవలే సైనస్ సమస్యకు కూడా ఆయన ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా భుజం శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ కోలుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande