
ఉండవల్లి, 12 జూలై (హి.స.)
ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆ మధురగాయనికి ఘనంగా నివాళులర్పించారు. జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ.. భారతీయ సంగీత ప్రపంచానికి జానకమ్మ చేసిన సేవలు అజరామరమైనవని కొనియాడారు. తెలుగు గడ్డపై పుట్టిన ఆమె, తన అద్భుతమైన స్వరంతో ఆరు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమె పాడిన పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎస్.జానకి కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi