తెలుగు గాయనీమణుల్లో జానకి గారు ఒక ఆణిముత్యం: పవన్ కల్యాణ్
తెలుగు గాయనీమణుల్లో జానకి గారు ఒక ఆణిముత్యం: పవన్ కల్యాణ్
S.Janaki


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

ప్రముఖ నేపథ్య గాయని, 'గాన కోకిల' ఎస్. జానకి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. జానకి గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యం. ఆమె గళం అత్యంత మధురమైనది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

'నిరీక్షణ', 'సితార', 'స్వాతిముత్యం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'ప్రతిఘటన', 'అంతఃపురం' వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన అద్భుతమైన గీతాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ఉత్తమ గాయనిగా నాలుగుసార్లు జాతీయ పురస్కారాలు, 10 సార్లు నంది పురస్కారాలను ఆమె అందుకున్నారు. తెలుగుతోపాటు పలు భారతీయ భాషలలో 50 వేలకి పైగా పాటలు పాడారు అని కొనియాడారు. జానకి మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande