అనకాపల్లి.జిల్లా పరవాడ ఫార్మా సిటీలో నీ.టొరంటో ఫార్మా కంపెనీ లో ప్రమాదం
అనకాపల్లి.జిల్లా పరవాడ ఫార్మా సిటీలో నీ.టొరంటో ఫార్మా కంపెనీ లో ప్రమాదం
అనకాపల్లి.జిల్లా పరవాడ ఫార్మా సిటీలో నీ.టొరంటో ఫార్మా కంపెనీ లో ప్రమాదం


అనకాపల్లి జిల్లా,, 13 జూలై (హి.స.)

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు. నైట్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరిపై ప్రమాదవశాత్తూ కెమికల్ పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

నాగరాజుది భీమిలి మండలం తగరపువలస. విధి నిర్వహణలో ఉండగా కెమికల్ ఆయనపై పడటంతో ఎడమ చేతికి, ఎడమ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నాగరాజును చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశాలపై సంస్థ యాజమాన్యం, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. పారిశ్రామిక ప్రమాదాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande