
ములుగు, 13 జూలై (హి.స.)
బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పుననిర్మాణ పనులను కేంద్ర జల నిపుణుల కమిటీ సూచించిన మేరకు పనులు చేపడతామని, వచ్చే వేసవి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రాష్ట్రం లో సాగునీరు, త్రాగునీరు సమస్య పరిస్కరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే నిపుణులతో కమిటీ వేసి పూర్తి నివేదిక తెప్పించామని, ఎంత ఖర్చయినా ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ను పరిశీలించారు.
హైదరాబాద్ నుండి నేరుగా దేవాదులు చేరుకున్న మంత్రులు సమ్మక్క సారక్క బ్యారేజీని పరిశీలించిన అనంతరం దేవాదుల ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను సంబధిత అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు ప్రణాళికతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 10 పంపుల ద్వారా 12 జిల్లాల్లోని 17 శాసన సభ కేంద్రాలకు నీటిని తరలిస్తామని తెలిపారు.
దేవాదులకు సంబంధించిన 194 కోట్ల పెండింగ్ బిల్లులు ఇప్పటికే విడుదల చేశామని, బిఆర్ఎస్ హయంలో నాసిరకంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టిన కారణంగానే మీరు పనికి రాకుండా పోయాయని తెలిపారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ ప్రాజెక్టు నిర్మాణ పనులను సెంట్రల్ సేఫ్టీ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారని, వారు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గోదావరి జిల్లాలో చేస్తే 44 గ్రామాలు నీటిన మునిగిపోయే అవకాశం
ఉందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ ప్రాజెక్టులు నేటికీ కట్టుదిట్టంగా ఉన్నాయని, కమిషన్ల కోసం బిఆర్ఎస్ నాయకులు నిర్మించిన ప్రాజెక్టు కూలిపోతున్నాయని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ నాయకులు అనేక ఆరోపణ చేస్తున్నారని, రానున్న రోజుల్లో జల యజ్ఞం పేరుతో ఎన్ని కోట్లు ఖర్చయినా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్మును దిగమింగిన ఆ పార్టీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మించగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పిల్లర్లు దెబ్బతిన్నాయని దీంతో ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి రైతులకు 80 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు