ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.. జనగామ జిల్లా కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.. జనగామ జిల్లా కలెక్టర్
Collector


జనగామ, 13 జూలై (హి.స.)

ప్రజలు తమ సమస్యలను అధికారుల

వద్దకు తీసుకొస్తే అవి తప్పకుండా పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని కల్పించేలా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తులను అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 335 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన ఇమ్మడి రేఖ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు, చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన యాకుబి తన వికలాంగ కుమారుడికి వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరారు, లింగాల ఘనపురం మండలం వేలేరు గ్రామానికి చెందిన పల్లా వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన భూమిని తన అనుమతి లేకుండా అన్నదమ్ములు తమ పేర్లపై పట్టా చేసుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు, కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సంధ్య తన కుమార్తెకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కల్పించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande